KCR | హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ పదేండ్ల పాలనపై, తెలంగాణ సాధించిన విజయాలపై ఇంకా ప్రశంసల వర్షం కురుస్తూనే ఉన్నది. పదేండ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన వృద్ధిని సాధించిందని వివిధ రంగాల నిపుణులు తరుచూ ప్రస్తావిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా పదేండ్ల ఆర్థిక వృద్ధిని ఆర్థిక నిపుణులు కొనియాడుతున్నారు. తాజాగా, ప్రముఖ ఆర్థికవేత్త, ఫైనాన్స్ ప్లానర్ డీ ముత్తుకృష్ణన్ సైతం తెలంగాణ ఆర్థిక వృద్ధిపై ప్రశంసలు కురిపించారు. ‘కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ ఆర్థిక రంగానిది అద్భుతమైన విజయ గాథ. దేశంలోని ఇతర రాష్ర్టాలు తెలంగాణను స్ఫూర్తి గా తీసుకోవాలి’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. మార్సెలస్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు సౌరభ్ ముఖర్జియా, నందిత రాజ్హన్సా ఇటీవలే రచించిన ‘బిహోల్డ్ ద లివియాథాన్: ద అన్యూజువల్ రైజ్ ఆఫ్ మాడ్రన్ ఇండియా’ పుస్తకంలో కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ సాధించిన ప్రగతిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేసీఆర్ హయాంను అద్భుత విజయంగా కొనియాడారు. ఈ పుస్తకంలోని తెలంగాణ అంశాలను ముత్తుకృష్ణన్ ప్రస్తావిస్తూ.. ‘ఆరేండ్లలోనే రాష్ట్రం తలసరి ఆదాయంలో రెట్టింపు ఫలితాన్ని సాధించిందని సౌరభ్ ముఖర్జియా తన పుస్తకంలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని నేను గతంలోనే చెప్పా ను. తెలంగాణను, ముఖ్యంగా హైదరాబాద్‌ను కేస్‌స్టడీగా తీసుకోవాలి’ అని ప్రశంసించారు.
తలసరిలో అగ్రస్థానం
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తలసరి ఆదాయం రెట్టింపునకుపైగా వృద్ధి సాధించింది. రాష్ట్రం ఏర్పడినప్పుడు 2014-15లో తలసరి ఆదాయం రూ. 1,24,104 మాత్రమే. 2023-24 నాటికి ఇది రూ. 3,47,299కు పెరిగింది. ఇదే సమయంలో జాతీయ తలసరి ఆదాయం 2023-24లో రూ. 2.12 లక్ష లు మాత్రమే. రాష్ట్రం ఏర్పడినప్పుడు తలసరి ఆదాయంలో దిగువన ఉన్న తెలంగాణ.. 2023 నాటికి పెద్ద రాష్ర్టాల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణ వ్యూహాత్మక పెట్టుబడులు, సంసరణలు, నగరీకరణ ఆర్థిక అభివృద్ధికి దోహపడ్డాయని నిపుణులు చెప్తున్నారు. దేశ తలసరి ఆదాయంతో పోల్చితే తెలంగాణలోని అనేక జిల్లాల తలసరి ఆదా యం ఎక్కువగా ఉన్నదని గణాంకాలు చెప్తున్నాయి. దేశంలోనే పెద్ద రాష్ర్టాలుగా చెప్పుకొనే గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక తదితర 13 పెద్దరాష్ర్టాలతో పోలిస్తే, తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధి రేటు ఎంతో ఎక్కువగా నమోదైంది. పదేండ్ల వ్యవధిలో తెలంగాణ తలసరి ఆదాయంలో 180 శాతం మేర పెరుగుదల నమోదు కాగా, దేశ ఆర్థిక రాజధాని ముంబై ఉన్న మహారాష్ట్రలో కేవలం 82 శాతం మాత్రమే వృద్ధి నమోదు కావడం గమనార్హం. ప్రధానమంత్రి మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో నమోదైన తలసరి వృద్ధిరేటు తెలంగాణ కంటే తక్కువగానే ఉన్నది.
వృద్ధిలో సరికొత్త రికార్డులు
గత రెండు దశాబ్దాల్లో తెలంగాణ, గుజరాత్, తమిళనాడు మాత్రమే ఆర్థికంగా 8 శాతం సగటు వార్షిక వృద్ధి రేటును కొనసాగించాయని ముత్తుకృష్ణన్ ప్రశంసించారు. ఈ రాష్ట్రాలు వచ్చే దశాబ్దంలో రెండంకెల వృద్ధి రేటును నమోదు చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. ఆ స్థాయిలో తెలంగాణను బలోపేతం చేశారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గణాంకాలు పరిశీలిస్తే.. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు తెలంగాణ ఏటా రెండంకెల వృద్ధి సాధించింది. కరోనా విలయం సృష్టించిన 2020-21 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే ఆర్థిక వృద్ధి మైనస్లలోకి వెళ్లింది. ఆ మరుసటి సంవత్స రం ఏకంగా 20 శాతం వృద్ధిరేటు సాధించి సరికొత్త రికార్డులు నెలకొల్పింది. తలసరి ఆదాయం, వృద్ధిలోనే కాదు, సొంత రాబడుల్లోనూ తెలంగాణ అద్భుతాలు సాధించింది. 2014-15లో సొంత రాబడులు రూ. 29,288 కోట్లు ఉండగా 2023-24 నాటికి రూ. 1,38,181 కోట్లకు చేరుకున్నది. అంతేకాదు, జీఎస్డీపీలోనూ తెలంగాణది విజయ గాధే. 2014-2023 మధ్య కాలంలో తెలంగాణ సగటున 12.7 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తే, దేశ సగటు 10.5 శాతం మాత్రమే. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 2014-15లో 4.0 శాతం ఉండగా.. 2022 -23 నాటికి 4.8 శాతానికి పెరిగింది. కేసీఆర్ పాలన గురించి, బీఆర్ఎస్ పాలన గురించి దేశవ్యాప్తంగా ఇప్పటికీ చర్చ జరుగుతున్నదంటే వివిధ రంగాలపై ఎలాంటి ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
కేసీఆర్ ఉంటే తెలంగాణ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించేది
కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ ఆర్థిక రంగానిది అద్భుతమైన విజయ గాథ. సౌరభ్ ముఖర్జియా రాసిన పుస్తకంలోనూ తెలంగాణ తలసరి ఆదాయం ఆరేండ్లలోనే రెట్టింపు అ యిందని చెప్పారు. దేశంలోని ఇతర రాష్ర్టాలు తెలంగాణ నుంచి స్ఫూర్తి పొంది ఆర్థిక విజయా లు సాధించాలి. అయితే తెలంగాణను ఈ స్థా యిలో నిలబెట్టిన కేసీఆర్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓటేయడం నాకు ఆశ్చ ర్యం కలిగించింది. ఆయన మూడోసారి అధికారంలోకి వచ్చి ఉంటే తెలంగాణ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించేది. పదేండ్ల తెలంగాణ అభివృద్ధిని, ముఖ్యంగా హైదరాబాద్‌ను అందరూ ఓ కేస్ స్టడీగా తీసుకోవాలి.
-డీ ముత్తుకృష్ణన్, సర్టిఫైడ్ ఫైనాన్స్ ప్లానర్
ఏ ప్రమాణం ప్రకారమైనా తెలంగాణది అద్భుతమైన విజయం. మూడోసారీ కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఉంటే తెలంగాణను మరింత ఉన్నతస్థానాలకు తీసుకెళ్లేవారు. పదేండ్ల తెలంగాణను, ముఖ్యంగా హైదరాబాద్‌ను ఆర్థిక వృద్థికి ఓ కేస్ స్టడీగా తీసుకోవాలి.
-ఫైనాన్స్ ప్లానర్ డీ ముత్తుకృష్ణన్
తలసరి ఆదాయం
2014-15లో 1,24,104
2014-2023 మధ్యకాలంలో తెలంగాణ సగటున 12.7% జీఎస్డీపీ వృద్ధి రేటు నమోదు
2022-23లో దేశ జీడీపీలో తెలంగాణ జీఎస్ డీపీ వాటా 4.8%వృద్ధి
జాతీయ సగటు
2023-24లో 2.12 లక్షలు
2023-24లో 3,47,299
8%వార్షిక వృద్ధి రేటునుకొనసాగిస్తున్న రాష్ర్టాలు
గుజరాత్, తమిళనాడు, తెలంగాణ ఈ మూడు రాష్ట్రాలు పదేండ్లలో రెండంకెల వృద్ధి రేటును నమోదు చేస్తాయని నిపుణుల అంచనా
తెలంగాణ తలసరి ఆదాయం (రూ.ల్లో)..