ఇందల్వాయి, ఆగస్టు 24: తరచూ విద్యుత్తు కోతలపై ప్రజలు భగ్గుమన్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని మెగ్యానాయక్ తండా వాసులు శనివారం గన్నారం సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. నిత్యం కరెంట్ కోతలు విధిస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు సహకరిస్తానని ఎస్సై మనోజ్‌కుమార్ హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని, జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని తండా వాసులు హెచ్చరించారు.