Congress | కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామసభలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతుండగా జనం నిరసనతో సభ హోరెత్తింది. సభ రసాభాసగా మారడంతో ఆందోళనకు దిగిన మహిళలను సముదాయిస్తున్న అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్
సిద్దిపేటలోని గాడిచెర్లపల్లి గ్రామసభలో రుణమాఫీ కాలేదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎదుట అధికారులను ప్రశ్నిస్తున్న రైతులు, రైతుల దరఖాస్తులను పరిశీలిస్తున్న హరీశ్‌రావు
యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలోని 23వ వార్డులో గ్యారెంటీల అమలు ఏమైందని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డిని ప్రశ్నిస్తున్న మహిళలు
నాగర్‌కర్నూల్ జిల్లా శ్రీపురంలో రుణమాఫీ ఎందుకు కాలేదని అధికారులను నిలదీస్తున్న మహిళారైతు
జగిత్యాల జిల్లా కొడిమ్యాల సభలో రోడ్డుపై పడుకొని నిరసన తెలుపుతున్న రైతు దేవయ్య
వరంగల్ జిల్లా నల్లబెల్లిలో జాబితాలో తప్పులు ఉన్నాయంటూ నిలదీస్తున్న ప్రజలు, ఆగ్రహంతో సభ మధ్యలోకి దూసుకొచ్చి హెచ్చరిస్తున్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
జగిత్యాల జిల్లా కొడిమ్యాల గ్రామసభలో పథకాల లబ్ధిదారుల జాబితా చదువుతుండగా నిరసన వ్యక్తమైంది.
అర్హులకు న్యాయం చేయడంలేదంటూ అధికారులను ప్రశ్నిస్తున్న ప్రజలు, గ్రామస్థులను సముదాయిస్తున్న అధికారులు
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం కూరెళ్లలో ప్రజాపాలన గ్రామసభలో రైతు రుణమాఫీపై అధికారులను నిలదీస్తున్న అన్నదాతలు
కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేరు లేకపోవడంతో రోదిస్తూ అధికారులకు దండంపెట్టి వేడుకుంటున్న మహిళ
నిజామాబాద్ మండలం కొత్తపేటలో పథకాల జాబితాలో తప్పులు ఉన్నాయంటూ నిలదీస్తున్న జనాన్ని సముదాయిస్తున్న అధికారులు
జనగామ జిల్లా బచ్చన్నపేట గ్రామసభలో అర్హులకు న్యాయం చేయాలంటూ అధికారులను నిలదీస్తున్న ప్రజలు, సముదాయిస్తున్న అధికారులు
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్‌లో గ్యాస్ సిలిండర్ రాయితీ పైసలు ఇవ్వాలంటూ అధికారులకు దండంపెట్టి వేడుకుంటున్న వృద్ధురాలు అచ్చవ్వ
అర్హతలు ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలకు తమను ఎందుకు ఎంపిక చేయలేదంటూ నిలదీస్తున్న ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామసభలో అధికారులను ప్రశ్నిస్తున్న గ్రామస్థులు
యాదాద్రి జిల్లా గుడిమల్కాపురం గ్రామంలో రేషన్ కార్డు, ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు ఎందుకు లేవంటూ అధికారులను నిలదీస్తున్న నిరుపేద మహిళలు
నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం గుడిపల్లి గ్రామసభలో అధికారులు చూపిన జాబితాలపై ఆగ్రహంతో నినాదాలు చేస్తున్న యువకులు, గందరగోళంగా మారిన సభ
ములుగు జిల్లా ములుగు మండలం జాకారంలో గ్రామ సభలో అర్హులకు పథకాలు ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులను నిలదీస్తున్న గ్రామస్థులు
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంటలో పారదర్శకంగా పథకాలు అమలు చేయాలంటూ అధికారులను నిలదీస్తున్న ప్రజలు
హనుమకొండ జిల్లా నడికూడ మండలం వరికోల్‌లో ప్రభుత్వ ప్రతినిధులను నిలదీస్తున్న ప్రజలు, పథకాలు పారదర్శకంగా అమలు చేయాలని డిమాండ్