హుజూరాబాద్ రూరల్, జనవరి 27 : కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ కేంద్రంగా పీవీ జిల్లా ఏర్పాటు చేయాలని జిల్లా సాధన జేఏసీ పిలుపు మేరకు ‘కెమిస్ట్-డ్రగ్గిస్ట్ అసోసియేషన్, శ్రీవిఘ్నేశ్వర ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్’ ఆధ్వర్యంలో మంగళవారం హుజూరాబాద్‌లో ర్యాలీ తీశారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం నుంచి అంబేదర్ చౌరస్త్తా వర కు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం వరంగల్-కరీంనగర్ ప్రధాన రహదారిపై రెండు గంటలు బైఠాయించారు. టౌన్ సీఐ కరుణాకర్ సముదాయించడంతో ఆందోళన విరమించారు.