సంగారెడ్డి : కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ వేడుకలకు గ్రామాల్లో ప్రజల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీల అమలను విజయవంతం అయినందుకు గాను ప్రచార శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలిపేందుకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిన్నది.
అందులో భాగంగా శనివారం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ చెందిన కళాబృందాలు ప్రభుత్వ పథకాలను(Prajapalana celebrations) ప్రచారం చేసేందుకు గ్రామానికి రాగా ప్రజలు అడ్డుకున్నారు. ఎంతమంది రైతులకు రుణమాఫీ చేశారు చెప్పండి అంటూ నిలదీశారు. కాంగ్రెస్ టైంలో తమకు ఎలాంటి న్యాయం జరగలేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామంలో ప్రభుత్వ పథకాలు అవసరం లేవు అంటూ వారిని గ్రామం నుంచి వెళ్లగొట్టారు. దీంతో కళా బృందాలు చేసేదేమి లేక నిరాశగా వెనుదిరిగాయి.
ఇవి కూడా చదవండి..
Revanth Reddy | గ్యారెంటీలకు పడిపోని ‘మరాఠీలు’.. రేవంత్ రెడ్డికి చెంపపెట్టు సమాధానం..
Sanjay Raut | ఇది ప్రజా తీర్పుకాదు.. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు