హైదరాబాద్ సిటీబ్యూరో/జనగామ/కామారెడ్డి, జూలై 15 (నమస్తేతెలంగాణ): ప్రజాపాలన అంటూ సీఎం రేవంత్‌రెడ్డి గొప్పలు చెప్పుకోవడమే గానీ ఎక్కడా క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని తెలంగాణ ప్రభు త్వ పెన్షనర్ల జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్‌కు దరఖాస్తులు సమర్పించినా ప్రయోజనంలేదని వాపోయారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం అన్నీ కలెక్టరేట్ల ఎదుట పెన్షనర్ల జేఏసీ సభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళనచేపట్టారు. జనగామ, కా మారెడ్డి కలెక్టరేట్లలో డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ కే లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ టీ శుభాకర్‌రావు మాట్లాడుతూ.. పెన్షనర్లకు బకాయి ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈహెచ్ఎస్ స్కీంతో అన్ని కార్పొరేట్ దవాఖానల్లో నగదు రహిత చికిత్స వర్తింపజేయాలని చెప్పారు.
ప్రతీ జిల్లాలో రెండు వెల్నెస్ సెంట ర్లు, హైదరాబాద్‌లో 10 వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసి వైద్యులు, మందులను అందుబాటులో ఉంచాలని కోరారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన ఐఆర్ 5 శాతాన్ని కనీసం 20 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. రూ.398 నిర్ణీత వేతనంతో పనిచేసి రిటైర్డ్ అయిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెం ట్లు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలో మాటిచ్చారని.. దాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. పెన్షన్‌దారులకు రాష్ట్రస్థాయిలో డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ పెన్షనర్లు క్రియాశీలకంగా పాల్గొన్నారని వారందరిని గుర్తించి ఇన్సెంటివ్ ఇచ్చి గౌరవించాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో చూపుతున్న నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు 30న రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్ వద్ద ‘మౌన దీక్ష’ చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 లక్షల మంది పెన్షనర్లు పాల్గొంటారని వివరించారు.