అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా... ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన ఒక్క హమీని నెరవేర్చరా..? అంటూ పెన్సనర్స్ జేఏసీ చైర్మన్ కే లక్ష్మయ్య సర్కారును ప్రశ్నించారు.
దసరా పండుగను పురస్కరించుకుని పెండింగ్లోని నాలుగు డీఏలను విడుదల చేయాలని పెన్షనర్ల జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. 20న నిర్వహించే మంత్రిమండలి సమావేశంలో పెండింగ్ డీఏలపై నిర్ణయం తీసుకోవాలని కోరింది.
ప్రజాపాలన అంటూ సీఎం రేవంత్రెడ్డి గొప్పలు చెప్పుకోవడమే గానీ ఎక్కడా క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని తెలంగాణ ప్రభు త్వ పెన్షనర్ల జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు.