హైదరాబాద్, సెప్టెంబర్ 18(నమస్తే తెలంగాణ): దసరా పండుగను పురస్కరించుకుని పెండింగ్లోని నాలుగు డీఏలను విడుదల చేయాలని పెన్షనర్ల జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. 20న నిర్వహించే మంత్రిమండలి సమావేశంలో పెండింగ్ డీఏలపై నిర్ణయం తీసుకోవాలని కోరింది. జేఏసీ చైర్మన్ కే లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ టీ శుభాకర్రావు బుధవారం ప్రకటన విడుదల చేశారు. కాలయాపనే తప్ప ఇంతవరకు ఒక్క సమస్యను పరిష్కరించలేదని, ఆర్థిక సంబంధంలేని అంశాలనూ పరిష్కరించడంలేదని ఆరోపించారు. పెండింగ్ బిల్లుల మంజూరు, డీఏల విడుదల, ఈహెచ్ఎస్ పథకాన్ని అమలు చేయాలని కోరారు.