ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 29 : ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చే యాలని బీసీ స్టూడెంట్స్ ఫెడరేష న్ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మనబోయిన సైదులుయాదవ్ డిమాండ్ చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో వివిధ విద్యా ర్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం వి లేకరుల సమావేశంలో సైదులుయాద వ్ మాట్లాడారు. 2లక్షల ఉద్యోగాలు, ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. మోసం చేసిందని మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించకపోతే త్వరలో సెక్రటేరియట్, అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. వీరబోయిన లింగయ్యయాదవ్, నూకల మధు, చేరాల వంశీ, సాయికిర ణ్, ఈరసాల సైదులు పాల్గొన్నారు.