హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీచర్ల జీపీఎఫ్, మెడికల్, సరెండర్ లీవు, టీఎస్జీఎల్ఐ సహా రిటైర్మెంట్ ప్రయోజనాల బిల్లులు ఏడాదిన్నరగా పెండింగ్‌లో ఉన్నాయని, దీంతో టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సంఘం 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శుల సమావేశాన్ని శుక్రవారం నారాయణగూడలోని కార్యాలయంలో నిర్వహించారు. కాంగ్రెస్ తమ మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టు సీపీఎస్‌ను రద్దుచేయాలని, బకాయిపడ్డ నాలుగు డీఏలను విడుదల చేయాలని కోరారు. సమావేశంలో రా్రష్ట్ర ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు పేరి వెంకట్‌రెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి గుండు లక్ష్మణ్ పాల్గొన్నారు.