రేవంత్‌రెడ్డి.. 420 సీఎం.. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
ఘోష్ కమిషన్ పేరిట కేసీఆర్‌పై కక్షగట్టి మూడేండ్లుగా పొలిటికల్ డ్రామా నడిపిన రేవంత్‌రెడ్డి.. రాష్ట్ర చరిత్రలో 420 ముఖ్యమంత్రిగా మిగిలిపోయారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్వరం కమిషన్‌పై హైకోర్టు తీర్పుతో ఈ విషయం తేటతెల్లమైందని పేర్కొన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : ఘోష్ కమిషన్ పేరిట కేసీఆర్‌పై కక్షగట్టి మూడేండ్లుగా పొలిటికల్ డ్రామా నడిపిన రేవంత్‌రెడ్డి.. రాష్ట్ర చరిత్రలో 420 ముఖ్యమంత్రిగా మిగిలిపోయారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్వరం కమిషన్‌పై హైకోర్టు తీర్పుతో ఈ విషయం తేటతెల్లమైందని పేర్కొన్నారు. కోర్టు తీర్పుతో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాల్లో మునిగితేలితే కాంగ్రెస్ శ్రేణులు తెల్లముఖం వేసుకున్నారని ఎద్దేవా చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో బీసీ కార్పొరేషన్ మాజీ సభ్యుడు కిశోర్గౌడ్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగానే మేడిగడ్డ బరాజ్‌కు మరమ్మతులు చేయకుండా కేసీఆర్‌ను రాజకీయ కుట్రలో ఇరికించే కుట్రలు చేశారని ఆరోపించారు.
ప్రభుత్వానికి భంగపాటు
ఘోష్ కమిషన్ నివేదిక ట్రాష్ అని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో తేలిపోయింది. ఇది ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుపై కాంగ్రెస్ చేసిన కుట్రపూరిత కేసులకు భయపడే ప్రసక్తే లేదు. రేవంత్‌రెడ్డి సర్కార్ ఎన్ని ఆటంకాలు, అవరోధాలు సృష్టించినా తెలంగాణ ప్రజల దీవెనలతో కేసీఆర్‌కు అంతామంచే జరుగుతుంది. కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టే లేకపోతే అధికారులతో కలిసి ఎందుకు పర్యటించారో రేవంత్‌రెడ్డి ప్రజలకు, రైతులకు సమాధానం చెప్పాలి. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని తెలుసుకొని రేవంత్‌రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నడు. ఏమి మాట్లాడుతున్నడో ఆయనకే తెలియడం లేదు.
-వంటేరు యాదవరెడ్డి, ఎమ్మెల్సీ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

