నర్సంపేట రూరల్, అక్టోబర్ 19: రైతుభరోసా పథకం విషయంలో తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన వరంగల్ జిల్లా నర్సంపేటలో మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ప్రతి ఒక్కరూ నిలదీయాలని పిలుపునిచ్చారు.
‘రైతుభరోసా’లో ఎకరాకు రెండు పంటలకు రూ.15 వేలు ఇస్తామని హామీ ఇవ్వడమేగాక దసరా పండుగ వరకైనా ఇస్తామని చెప్పి అమలు చేయలేదని విమర్శించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ వానకాలం సీజన్ పంటలకు రైతుభరోసా ఇవ్వలేమని చెప్పడం రైతాంగాన్ని మోసం చేయడమేనని ఆయన గుర్తుచేశారు.