దుగ్గొండి, మార్చి15 : వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల గారమంలోని లక్ష్మీనరసింహస్వామి జాతరలో ఉద్రిక్తం నెలకొంది. శనివారం వివిధ పార్టీల ప్రభ బండ్ల తరలింపు సందర్భంగా వరంగల్- నర్సంపేట రహదారి దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామంలో గందరగోళం నెలకొంది. గిర్నిబావి సెంటర్లో వారం రోజులుగా నర్సంపేట ఏసీపీ కిరణ్‌కుమార్ ఆద్వర్యంలో పోలీసులు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌కు చెందిన ప్రభలను ముందుగా తరలిస్తూ బీఆర్ఎస్ ప్రభ బండ్లను చెక్ పోస్టుల వద్ద నిలిపివేశారు.
తొగర్రాయికి చెందిన కాంగ్రెస్ ప్రభబండి ముందుకు రాగా బీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తంచేయడంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో నర్సంపేట ఏసీపీ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలపై విచక్షణారహితంగా లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో గిర్నిబావికి చెందిన కంచరకుంట్ల శ్రీనివాస్‌రెడ్డి, యార శ్రీనివాస్, సద్ది నరసింహారెడ్డి భుజాలు, తొడలపై బొబ్బలు వచ్చాయి. విషయం తెలుసుకున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఘటనాస్థలానికి వచ్చి ధర్నా చేశారు. అకారణంగా ఏసీపీ ఆధ్వర్యంలో వందల సంఖ్యలో పోలీసులు తమ కార్యకర్తలపై దాడి చేశారని మండిపడ్డారు.