నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత అని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆ మృతికి బాధ్యత వహించి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. శంకర్ గౌడ్ కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం ఇవ్వాలన్నారు. శంకర్ గౌడ్ ఆత్మహత్యకు యత్నించిన తర్వాత అతనికి మెరుగైన వైద్యం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అతను మరణించిన విషయాన్ని దాచి, హడావుడిగా పోస్టుమార్టం చేసి డెడ్ బాడీని పోలీస్ ఎస్కార్ట్ మధ్య నర్సంపేట తరలించారని అన్నారు.
ఆర్టీసీ సమ్మెపై చర్చలని పిలుస్తూనే.. మరోవైపు ఉక్కుపాదం మోపడాన్ని పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆర్టీసీ కార్మికుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.