వరంగల్ చౌరస్తా : నాగేశ్వర్ రావుది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యేనని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదరర్శన్రెడ్డి(Peddi Sudarshan Reddy) ఆరోపించారు. ములుగు జిల్లా బుట్టాయిగూడెం కుమ్మరిగూడెంలో జనవరి 23వ తేదీన నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్లు (Indiramma houses) దరఖాస్తుదారుల జాబితాలో తన పేరు లేకపోవడంతో.. కుమ్మరి నాగేశ్వర రావు (42) పురుగుల మందు తాగాడు. కాగా, ఎంజీఎం హాస్పిటల్ లో కిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు.
మృతుడి కుటుంబాన్ని నర్సంపేట మాజీ ఎంఎల్ఏ పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించి, కుటుంబసభ్యులకు సంతాపాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగేశ్వర్ రావు ది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యేనని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి 25 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుమారు 15 రోజులు అచేతన స్థితిలో ఉన్నా అధికారులు గానీ, నాయకులు గానీ పట్టించుకున్న నాథుడే లేడని ఆగ్రహం వ్యక్తిం చేశారు. మృతుడి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.