BRS Protests : సిట్ విచారణ పేరుతో ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ను వేధిస్తున్నారంటూ రేపు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల నిరసన ప్రదర్శనలు చేయనున్నారు. రేపు రాష్ట్రమంతటా శాంతియుతంగా ఆందోళనలకు దిగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 12 వేలకుపైగా గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలని సూచించారు.
నిరసనల్లో భాగంగా ప్రతి మున్సిపల్, నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులు బైక్ ర్యాలీలు నిర్వహించనున్నాయి. నల్ల జెండాలతో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నారు. ధర్నాలు, రాస్తారోకోల ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయనున్నారు. మాజీ మంత్రులు, సీనియర్ నేతలు, పార్టీ శ్రేణులు ఆందోళనల్లో పాల్గొనాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. నిరసనలు శాంతియుతంగా చేయాలని, పోలీసులతో ఘర్షణలు వద్దని సూచించారు.