రాష్ట్రేతర మద్యం తీసుకొస్తే పీడీ యాక్ట్
రాష్ట్రంలోకి ఇతర రాష్ర్టాల నుంచి మద్యాన్ని అక్రమంగా తీసుకొస్తే పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని అధికారులకు ఆబ్కారీ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు. గురువారం సచివాయంలో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
- ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోకి ఇతర రాష్ర్టాల నుంచి మద్యాన్ని అక్రమంగా తీసుకొస్తే పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని అధికారులకు ఆబ్కారీ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు. గురువారం సచివాయంలో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అంతర్రాష్ట్ర రవాణా సర్వీసులైన కార్గో, ఇతర పార్సిల్ సర్వీస్ ద్వారా ఇతర రాష్ర్టాల మద్యం అక్రమంగా సరఫరా కాకుండా నిర్వాహకులకు నోటీసులు ఇవ్వాలని చెప్పారు.
రాష్ట్రంలోకి అక్రమ మద్యం తరలించిన వారికి విధించే శిక్షను కూడా ఐదేండ్ల నుంచి ఏడేండ్లకు పెంచేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా లోతుకుంటలో అరుణ్‌కుమార్ శర్మ అక్రమంగా నిల్వ ఉం చిన 102 ఆర్మీ మద్యం బాటిళ్లను ఎక్సైజ్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

