పెద్దఅంబర్‌పేట, అక్టోబర్ 28: ‘ఎం’ (మనీ) ఫార్ములాతోనే కాంగ్రెస్ తనకు టికెట్ ఇవ్వలేదని పీసీసీ కార్యదర్శి, పీసీ సీ ఎన్నికల ప్రచార కమిటీ కార్యనిర్వాహక సభ్యుడు దండెం రాంరెడ్డి ఆరోపించారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ అభ్యర్థిగా మల్రెడ్డి రంగారెడ్డి పేరును ప్రకటించడంతో ఆయన శనివారం తన అనుచరులు, మద్దతుదారులతో పెద్దఅంబర్‌పేటలోని నివాసంలో భేటీ అయ్యారు. శుక్రవారం మధ్యా హ్నం వరకు అభ్యర్థుల జాబితాలో తన పేరే ఉన్నదని, మధ్యాహ్నం తర్వాత ‘ఎం’ ఫార్ములాతో టికెట్‌ను మల్రెడ్డి రంగారెడ్డికి ఇచ్చిందని ఆరోపించారు.