హైదరాబాద్, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రశాంతంగా జరిగిందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి ఉప ఎన్నిక ప్రచారం, అందరికీ సలహాలు, సూచనలు ఇచ్చారని చెప్పారు. ప్రభుత్వ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, అందుకే తమ అభ్యర్థికి పెద్ద ఎత్తున మద్దతు పలికారని చెప్పారు.