హైదరాబాద్, జూలై 3(నమస్తే తెలంగాణ) : ‘కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉండొచ్చు.. ప్రతిపార్టీలోనూ ఉంటారని’ టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. పార్టీ క్రమశిక్షణ విషయంలో సీరియస్‌గా ఉంటామని, ఆధారాలు లేకుండా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.
ఎమ్మెల్యే అనిరుధ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు చెప్పారు. అనురుధ్‌రెడ్డి వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమైన నేపథ్యంలో మహేశ్‌కుమార్ గౌడ్ చేసిన కామెంట్స్ మరింత హాట్ టాపిక్‌గా మారాయని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తున్నది.