Harish Rao | జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిటీ తమ హక్కులను కాలరాసిందని హరీశ్‌రావు ఆరోపించారు. కాళేశ్వరం రిపోర్ట్‌పై విచారణ సందర్భంగా ఆయన హరీశ్‌రావు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పీసీ ఘోష్ ఎఫెక్ట్ పీపుల్ అయిన మా హక్కులను కాలరాశారు. మాకు 8బీ కింద నోటీసులు ఇవ్వలేదు. మాపై చేయబోతున్న ఆరోపణల గురించి ఆ వివరాలు చెప్పి.. దానిపై మా వివరణ తీసుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. దాన్ని ఆయన అనుసరించలేదు. నాకుగానీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గానీ, ఇంకా పిలిచిన నేతలు, అధికారులకు కూడా నాకు తెలిసిన వరకు 8బీ కింద నోటీసులు ఇవ్వలేదు. క్రాస్ ఎగ్జామినేషన్‌కు అవకాశం ఇవ్వలేదు. ఈ విచారణ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందనేది సుస్పష్టం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అసలు మేడిగడ్డ వద్ద లోపం ఏర్పడక ముందే కాళేశ్వరంపై దుష్ప్రచారాన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రారంభించారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో కూడా మేం సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తామని ముందే మేనిఫెస్టోలో పెట్టింది. కాంగ్రెస్ ముందు నుంచి కూడా ఈ ప్రాజెక్టు కడితే కేసీఆర్, బీఆర్ఎస్కు ఎక్కడ పేరు వస్తుందోనని కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నరు. భూ సేకరణను అడ్డుకున్నారు. అనేక ఆరోపణలు చేస్తూ వచ్చారు. దాంట్లో భాగంగానే ఈ ఘోష్ కమిషన్ వేసి రాజకీయమైన కక్ష సాధింపునకు ఈ ప్రభుత్వం దిగుతుంది. నేను చెప్పేది ఒకటే విషయం. ఆ వాస్తవాలు చట్టానికి లోబడి ఉండాలి. ఘోష్ కమిషన్ రిపోర్ట్‌లో ఎక్కడా లేదు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది’ అన్నారు.
‘8బీ ప్రకారం నోటీసులు ఇవ్వకుండా గతంలో విచారణ కమిషన్ల నివేదికలు ఏమయ్యాయో ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 1958లో సుప్రీంకోర్టు రాంకృష్ణ దాల్మియా వర్సెస్ జస్టిస్ టెండూల్కర్ కేసులో విచారణ కమిషన్‌ను రాజకీయ అస్త్రం వాడుకోవద్దని సుప్రీంకోర్టు చెప్పింది. కాళేశ్వరంపై మొదటి నుంచి చెబుతూ వస్తున్న గోబెల్స్ చరిత్రను చూస్తే ఈ కమిషన్ రిపోర్టును పొలిటికల్ వెపన్‌గా వాడుతున్నారని సుస్పష్టంగా అర్థమవుతున్నది. ఇదే కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే.. విచారణ కమిషన్ అయినా విచారణ సందర్భంలో 1952 చట్టాన్ని మీరకూడదు. చట్టం పరిధిలో నిస్పాక్షికంగా విచారణ జరపాలని కుండబద్దలుకొట్టినట్లు సుప్రీంకోర్టు చెప్పింది. ఇవాళ ఘోష్ కమిషన్ 8బీ కింద మాకు నోటీసులు ఇవ్వలేదు. విచారణ నిస్పాక్షికంగా జరుపలేదు. అందుకే ఈ విచారణ అన్ఫేర్. రాజకీయ ప్రేరేపితమని చెప్పదలచుకున్నాను. 1989లో కిరణ్ బేడీ వర్సెస్ కమిటీ ఆఫ్ ఎంక్వైరీలో 8బీ కింద నోటీసులు ఇవ్వకుండా విచారణ చేస్తే.. ఆ రోజు సుప్రీంకోర్టు ‘ఈ రిపోర్ట్ చెల్లదు. ఈ రిపోర్ట్ న్యాయబద్ధం కాదు. ఈ రిపోర్ట్ లెక్కకు రాదు’ అని సుప్రీంకోర్టు కుండబద్దలు కొట్టింది’ అని గుర్తు చేశారు.
‘ఎల్కే అద్వానీ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్.. ఎల్కే అద్వానీపై ఇలాంటి విచారణ కమిటీ వేస్తే.. 8బీ నోటీసులు ఇవ్వనందుకు 2003లో పాట్నా హైకోర్టులో కేసు వేస్తే.. 8బీ కింద విచారించలేదు.. ఇది తప్పు అన్నప్పుడు.. హైకోర్టు ఆ కేసును కొట్టివేసింది. అప్పుడు బిహార్ రాష్ట్రం సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్తే.. 8బీ కింద నోటీసులు ఇవ్వకపోతే విచారణ నివేదిక చెల్లదని సుప్రీంకోర్టు కూడా కేసును కొట్టివేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. తమిళనాడులో 1997లో జయలలిత వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో 8బీ కింద నోటీసు ఇవ్వకపోతే మద్రాస్ హైకోర్టు కూడా నివేదిక చెల్లదని.. చిత్తుకాగితంతో సమానమని.. రిపోర్ట్‌ని కొట్టివేసిందని గుర్తు చేస్తున్నాను. మీరు ఇగ ఇందిరమ్మ రాజ్యం అంటున్నరు కదా? ఇందిరమ్మపై వేసిన కమిషన్ కూడా ఉంది. ఆ నాడు ఇందిరా గాంధీ 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధిస్తే.. అప్పుడు అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం ఇందిరాపై షా కమిషన్ వేసింది. షా ఎవరూ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. మా ఉత్తమ్ ఉంటున్నడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి తీర్పునే తప్పు పడుతరా? సుప్రీంకోర్టు నివేదికను పీసీసీ రిపోర్ట్ అంటరా? అన్నరు. ఆ రోజు కాంగ్రెస్ నాయకులు దేశవ్యాప్తంగా ధర్నాలు చేశారు. షా కమిషన్ కక్షపూరితమైందని.. రాజకీయ ప్రేరేపితమైందని ఆరోపించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా మీరు ధర్నాలు చేస్తే ఒప్పు.. ఈ చెత్త రిపోర్ట్‌ను తప్పు అంటే.. మాది తప్పు అవుతుందా? అని అడుగుతున్నా’ అంటూ హరీశ్‌రావు నిలదీశారు.