హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు బిల్లులను ఆన్లైన్లో చెల్లించడం వల్ల పడే చార్జీల భా రాన్ని తిరిగి వినియోగదారులపై మో పేందుకు విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)లు సిద్ధమవుతున్నాయి. ఆ మొ త్తాన్ని వినియోగదారుల నుంచి ముక్కుపిండి వసూలు చేయనున్నా యి. ఇలా నెలకు 2 కోట్ల చొప్పున ఏ డాదికి 24 కోట్ల భారాన్ని వినియోగదారులపై మోపనున్నాయి. విద్యుత్తు బిల్లులను ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం లాంటి థర్డ్‌పార్టీ పేమెంట్ యాప్‌ల ద్వారా చెల్లించడాన్ని విద్యుత్తు సంస్థలు ఇటీవలు నిలిపివేసిన విషయం తెలిసిందే. రిజర్వుబ్యాంకు (ఆర్బీఐ) నిబంధనల ప్రకారం ఆయా ఏజెన్సీలు భారత్ బిల్ పేమెంట్ సిస్టం (బీబీపీఎస్)లో నమోదు కాకపోవడమే ఇందు కు కారణం. కానీ, ఆన్లైన్లో బిల్లుల చెల్లింపుల కోసం డిస్కంలు సైతం బీబీపీఎస్‌లో నమోదు కావాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో బీబీపీఎస్‌లో చేరేందుకు అనుమతివ్వాలని కోరుతూ డిస్కంలు ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాశాయి. ఈ అనుమతి లభించడం లాంఛనమే కానున్నది. విద్యుత్తు బిల్లుల చెల్లింపునకు వినియోగదారులు జరిపే ప్రతి లావాదేవీపై బీబీపీఎస్కు డిస్కంలు 3.50 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి
ప్రస్తుతం మన రాష్ట్రంలోని విద్యు త్తు వినియోగదారుల్లో 90% కంటే ఎక్కువ మంది ఆన్లైన్లోనే బిల్లులు చెల్లిస్తున్నారు. ఆ లావాదేవీలకు బీబీపీఎస్ చార్జీలను విధించనుండటంతో వా టిని వినియోగదారులపై మోపేందుకు డిస్కంలు ప్రయత్నిస్తున్నాయి. ఆర్థికభా రాన్ని తగ్గించుకునేందుకు ప్రత్యామ్నా య మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ చార్జీ తీసుకుని బిల్లుల వసూలుకు ఇటీవల పలు బ్యాం కులు ముందుకొచ్చాయి. ఒక్కో లావాదేవీకి కేవలం రూ.2 చొప్పున తీసుకునేందుకు ఎస్బీఐ సంసిద్ధత వ్యక్తం చేసింది. మరికొన్ని బ్యాంకులతో డి స్కంలు చర్చలు జరుపుతున్నాయి. మ రోవైపు క్యూఆర్ కోడ్ ద్వారా వినియోగదారులు బిల్లులు చెల్లించేందుకు వీలుకల్పించాలని భావిస్తున్నాయి.