హైదరాబాద్, నవంబర్4 (నమస్తే తెలంగాణ): బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వారంలోగా విడుదల చేయాలని, లేదంటే తమ సంఘం ఆధ్వర్యంలో సచివాలయాన్ని ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ స్పష్టంచేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి మంగళవారం ఆయ న లేఖ రాశారు. ఫీజు బకాయిల కోసం ఉద్యమిస్తున్న కళాశాలల యజమాన్యాలకు, విద్యార్థులకు ఆయన మద్దతు ప్రకటించారు. బడా కాంట్రాక్టర్ల బిల్లులను నిలుపుదల చేసైనా, విద్యార్థుల ఫీజు లు, సాలర్షిప్లను విడుదల చేయాలి డిమాండ్‌చేశారు. ప్రభు త్వం ఫీజులు ఇవ్వకుండా విద్యార్థులను, కళాశాలల యజమాన్యాలను వేధించడం తగదని హితవు పలికారు. వెంటనే సీఎం జోక్యం చేసుకుని కళాశాలల యజమాన్యాలతో చర్చలు జరిపాలని డిమాండ్ చేశారు.