హైదరాబాద్, ఆగస్టు 14(నమస్తేతెలంగాణ): మనఊరు-మనబడి పథకం కింద పనులు చేసిన కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. బిల్లులు రాకపోవడంతో పనులు చేసిన కాంట్రాక్టర్లు చాలా ఇబ్బందులు ఎదురొంటున్నారని, తనని కలిసి వారు తమ పరిస్థితిని వివరించారని తెలిపారు.
ఈ పథకం కింద సివిల్ పెండింగ్ బిల్లులు రూ.361.350 కోట్లు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలోని చిన్న కాంట్రాక్టర్లు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల సభ్యులు రుణాలు తీసుకుని పనులను పూర్తి చేశారని, బిల్లులు రాక వారు చాలా ఇబ్బందులు ఎదురొంటున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.