జడ్చర్ల, డిసెంబర్ 3 : తెలంగాణ వాళ్ల దిష్టి వల్లనే కోనసీమలో చెట్లు చనిపోయాయని.. కోనసీమవల్లనే తెలంగాణ వచ్చిందని.. సినీనటుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యానించడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలకు పవన్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, అప్పటి వరకు జడ్చర్లలో పవన్ సినిమాలు ఆడనివ్వబోమని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు, నాయకుల ఉద్యమం వల్లనే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా సినిమా రేట్లు పెంచాలంటే 20 శాతం కార్మికులకు ప్రాఫిట్ షేరింగ్ చేయాలని చెప్పినట్లు గుర్తు చేశారు. అందుకు సంబంధించిన జీవోను రిలీజ్ చేయాలని కోరారు.