పెన్‌పహాడ్, సెప్టెంబర్ 5 : సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బయాలజీ టీచర్‌గా పని చేస్తున్న మారం పవిత్ర 2025 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. దేశ వ్యాప్తంగా 44 మందిని ఎంపిక చేయగా తెలంగాణ నుంచి పవిత్ర ఒక్కరే ఎంపికయ్యారు. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.