వికారాబాద్, నవంబర్ 14: లగచర్ల ఘట న కేసులో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని వికారాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. బీఆర్ఎస్ లీగల్ టీమ్ తరపున న్యాయవాదులు శుభప్రద్ పటేల్, రాంచందర్‌రావు, రమేశ్‌గౌడ్, అశోక్, వెంకట్‌రెడ్డి, జగ న్, వేణుగోపాల్‌రావు, లక్ష్మణ్, పరమేశ్ తదితరులు గురువారం వికారాబాద్ జిల్లా కోర్టు లో ఈ పిటిషన్ వేశారు.
అంతకు ముందు నోటీసు ఇవ్వడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను లీగల్ టీమ్ కలవగా, నోటీసు తీసుకోవడానికి నిరాకరించారు. న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన ఆదేశాలతో ఎట్టకేలకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆ నోటీసును స్వీకరించారు. అనంతరం నరేందర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను సోమవారానికి వాయిదా వేసినట్టు బీఆర్ఎస్ లీగల్ టీం సభ్యులు తెలిపారు.