హైదరాబాద్ మే 15 (నమస్తేతెలంగాణ): మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి ‘అబద్ధాలకు అంబాసిడర్‌గా మారకు’ అంటూ మాట్లాడిన మంత్రి సీతక్కకు బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు.‘ సీతక్కా..నోరు జాగ్ర త్త..మీరు మాట్లాడేది ఓ మహిళ గురించి అనే విషయం మర్చిపోయారా?’ అని గురువారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
సర్కారు తప్పిదాన్ని కప్పిపుచ్చుకొనేందుకు మిస్‌వరల్డ్ కంటెస్టెంట్ కాళ్లు కడిగిన మహిళను తప్పుపట్టేలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.