హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 20 (నమస్తే తెలంగాణ): అయోధ్య రామ మందిరంలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో పాస్‌పోర్టు కార్యాలయానికి 22న హాఫ్‌డే సెలవు ప్రకటించామని ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి జే స్నేహజ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం సోమవారం సగం రోజు సెలవుగా ప్రకటించడంతో పాస్‌పోర్టు సేవలు అందించే షెడ్యూలును మార్చామని చెప్పారు. ఉదయం 9.45 గంటల నుంచి మధ్యాహ్నం 2.15 గంటల వరకు ఉన్న షెడ్యూలను, మధ్యాహ్నం 2.45 నుంచి పాస్‌పోర్టు సేవల కోసం టోకెన్లు పొందిన వారు ఆయా పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో సంప్రదించాలని ఆమె సూచించారు.