అయిజ, అక్టోబర్ 14: జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు అయి జ బస్టాండ్‌కు ప్రయాణికులు పెద్ద ఎత్తున చేరారు. సరిపడా బస్సుల్లేకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ఆదివారం అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. గద్వాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు ప్రతి రోజు రాత్రి 10 గంటలకు ఓ బస్సు బయలుదేరి అయిజ బస్టాండ్‌కు రాత్రి 11:15 గంటలకు చేరుకుంటుంది. గద్వాలలో 90 మంది ప్రయాణికులు ఎక్కారు. వారిలో హైదరాబాద్‌కు వెళ్లే వారే అ ధికంగా ఉన్నారు.
ఈ బస్సు అయిజ బస్టాండ్‌లోకి చేరగానే.. అక్కడ అప్పటికే ఎదురుచూస్తున్న సుమారు 200 మంది బస్సులో ఎక్కేందుకు ప్రయత్నించగా.. బస్సు ఖాళీగా లేదు. దీంతో వారంతా ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ అధికారులను ఫోన్లో సంప్రదించినా స్పందిచకపోవడంతో ఒకే బస్సులో దాదాపు 290 మంది ఎలా వెళ్తారని మండిపడ్డారు. చివరకు 150 మందితో బస్సు హైదరాబాద్‌కు బయ లుదేరింది. మిగతావారు రైల్వేస్టేషన్ వైపు పరుగులు తీశారు.