Shamshabad Airport | శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఇద్దరు ప్రయాణికులు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. నితిన్ షా, షేక్ సకీనా అనే ప్రయాణికులు విమానాశ్రయంలోకి ప్రవేశించగానే అక్కడికక్కడే కూలిపోయారు. అక్కడనే ఉన్న భద్రతా సిబ్బంది వేగంగా స్పందించి వారిని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నితిన్ షా స్వస్థలం గోవా కాగా.. సకీనా సౌదీ అరేబియాలోని జెడ్డా. వీరిద్దరి మరణానికి కారణాలు తెలియరాలేదు. పోలీసులు మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.