హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ) : పార్టీ ఫిరాయింపులకు పా ల్పడిన శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ హైకోర్టులో మరోసారి వాయిదా పడింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలో క్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట గురువారం పిటిషన్లు విచారణకు వచ్చాయి. వెంటనే ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి కల్పించుకొని వాయిదా వేయాలని కో రారు. వెంటనే పిటిషనర్ల తరఫు న్యా యవాది రామచందర్‌రావు తీవ్ర అభ్యంతరం చెప్పా రు. దీంతో విచారణను నవంబర్ 4వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది.