తాండూర్ : రాష్ట్ర గ్రంథాలయ పార్ట్ టైం స్వీపర్స్ ( Part-time sweepers ) ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్లో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ ( Riyaz ) కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర గంథాలయ యూనియన్ అధ్యక్షుడు చాగంటి అయోధ్య మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా గ్రంధాలయ పార్ట్ టైం స్వీపర్స్ వేతనాలు పెంచాలని , ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
సంస్థ చైర్మన్ తమ సమస్యలను సానుకూలంగా విని డైరెక్టర్ శ్రీహరితో కలిసి చర్చించి త్వరలోనే సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్ట్ టైం స్వీపర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పిట్ట హుస్సేన్, ప్రధాన కార్యదర్శి కాస్తల మధు, గౌరవ అధ్యక్షుడు ఎనగందుల శ్రీనివాస్, కోశాధికారి ఖమ్మంపాటి మధుసూదన్, సహాయ కార్యదర్శి సయ్యద్ సలీం, చెరుకు స్వామి, సభ్యులు పాల్గొన్నారు.