హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తేతెలంగాణ): పార్లమెంట్‌పై దాడి ఘటనలో అమరులైనవారికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర నివాళులర్పించారు. శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో అమరుల చిత్రాల వద్ద పూలు ఉంచి నివాళులర్పించారు.