హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): పార్లమెంటరీ అధికారులు అప్డేటెడ్గా ఉండాలని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్హెచ్ఆర్డీ) డీజీ, ప్రిన్సిపల్ సెక్రటరీ బెన్హర్ మహేశ్‌దత్ ఎక్కా సూచించారు. లో క్‌సభ సెక్రటేరియట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, రీసెర్చ్ ఆఫీసర్ల ‘కెపాసిటీ బిల్డింగ్ కమ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రాం’ను సోమవారం ఆయన ప్రా రంభించి మాట్లాడారు.
పార్లమెంట్ సభ్యుల ఆలోచన, కార్యాచరణ, విధానాలను పథకాలుగా మా ర్చడంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, రీసెర్చ్ ఆఫీసర్లు కీలకపాత్ర పోషించాలని పేర్కొన్నారు. లోక్‌సభ సెక్రటేరియట్ డిప్యూటీ సెక్రటరీ సిద్ధార్థ గౌతమ్, చీఫ్ కన్సల్టెంట్ (ట్రైనింగ్) డాక్టర్ తిరుపతి, కోర్సు కోఆర్డినేటర్ ప్రొఫెసర్ మహ్మద్ అబ్బాస్ అలీ, అదనపు కోర్సు కోఆర్డినేటర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.