హైదరాబాద్ : వాళ్లిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెద్దలను ఎదురించి మరీ పెళ్లి చేసుకున్నారు. భార్య భర్తలు గొడవపడి పిల్లలను పోలీస్ స్టేషన్లో వదిలి వెళ్లారు. ఈ అమానవీయ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్లనూరులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రవి, లలితకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇటీవల వారి దాంపత్య జీవితంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో ఎల్.ఎం.డీ పోలీస్ స్టేషన్లో లలిత తాళి, మెట్టెలు తీసేసి వెళ్లిపోయింది. దీంతో పిల్లలు తనకూ వద్దంటూ తండ్రి రవి వదిలి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు వదిలి వెళ్లడంతో పిల్లలు బిక్కు బిక్కుమంటూ పోలీస్ స్టేషన్లో గడిపారు. పోలీసులు పిల్లల నానమ్మను పిలిచి అప్పగించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కరీంనగర్ జిల్లాలో పిల్లల పట్ల మానవత్వం మరిచిన తల్లిదండ్రులు
కన్న బిడ్డలను పోలీస్ స్టేషన్లో వదిలేసి వెళ్ళిన తల్లిదండ్రులు
తిమ్మాపూర్ మండలం అల్లనూరులో భర్త, పిల్లలు వద్దంటూ తాళి, మెట్టెలు తీసేసి వెళ్ళిపోయిన తల్లి లలిత
దీంతో పిల్లలు తనకూ వద్దంటూ ఎల్.ఎం.డీ పోలీస్ స్టేషన్లో వదిలి… pic.twitter.com/JJfiyJ1bQ5
— Telugu Scribe (@TeluguScribe) April 28, 2026