Telangana | హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): చిన్నారులు ఇంట్లో చదుకునేందుకు రీడింగ్ కార్నర్లు ఏర్పాటు చేయాలి. ఇంట్లో సక్రమంగా చదువుకునే వాతావరణాన్ని కల్పించాలి. శబ్దాలు రాకుండా, అంతరాయం కలగకుండా టీవీ, రేడియో, మొబైల్ఫోన్లను ఆఫ్‌చేయాలి. ఇవి విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యాశాఖ జారీచేసిన సూచనలు. నూతన విద్యాసంవత్సరం ప్రారంభంకావడంతో అకడమిక్ అంశాలపై విద్యాశాఖ దృష్టిసారించింది. పాఠశాల సహా పిల్లల చదువుల్లో తల్లిదండ్రులను సైతం భాగస్వామ్యం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చొరవ తీసుకుంటోంది. ప్రతీ నెలా మూడో శనివారం బడుల్లో పేరెంట్ టీచర్ సమావేశాలను నిర్వహిస్తుంది. ‘పేరెంట్ యాజ్ పార్టనర్స్’ థీమ్‌తో 20న రాష్ట్రంలోని అన్ని సర్కారు బడుల్లో పేరేంట్ టీచర్ సమావేశాలను నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి ఆదేశించారు. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ఆయా జాగ్రత్తలను తల్లిదండ్రులకు వివరించాలని, పాటించేలా చూడాలని హెచ్ఎంలకు ఆదేశాలిచ్చారు.
తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు