ఝరాసంగం, జనవరి 27 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసేందుకు మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ బృందం పాదయాత్రగా బయలుదేరారు. వివరాల్లోకి వెళ్తే..సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని మేదపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్(Parameshwar Patil) ఆధ్వర్యంలో సుమారు 100 మంది యువకులతో కేసీఆర్ను(KCR) కలిసేందుకు సోమవారం సంగమేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. కేసీఆర్ నిండునూరేళ్లు ఆయురారోగ్యలతో ఉండాలని స్వామి వారికి అభిషేకం, మహా మంగళ హారతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాలుగు రోజుల పాటు సాగే పాదయాత్ర గజ్వేల్ మీదుగా ఎర్రవల్లిలోని వారి ఫౌమ్ హౌస్ వరకు 140 కిలోమీటర్లు సాగునుంది.
ఈ పాదయాత్రను జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమార్ ముఖ్య అథితిగా హాజరై ప్రారంభించారు. కేసీఆర్పై ఉన్న అభిమానంతో పాదయాత్రగా వేళ్తున్న పరమేశ్వర్ పటేల్ వారి బృందానికి ఎక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని విధాలుగా చూసుకుం టుమని ఎమ్మల్యే, డీసీఎంఎస్ చైర్మన్లు అన్నారు. పరమేశ్వర్ పటేల్ మాట్లాడుతూ..కేసిఆర్ అంటే నాకు ఇష్టం ఆయన పాలన చాలా బాగుంటుందని, పదేండ్లలో తెలంగాణ రాష్ట్రం విలువను పదిరెట్లు పెంచార న్నారు. ఆయన లేని లోటు రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలుస్తుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వలన ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యలను వివరిస్తామన్నారు. పాదయాత్రకు బయలుదేరుతున్న వారిలో బస్వరాజ్, ప్రశాంత్, మారుతి, చంద్రయ్య, మాణిక్, వెంకట్, సతీష్, పాండు, బోయిని పాండు, విజయ్, శ్రీనివాస్, మోహన్, అవసలి బస్వరాజ్, రాము, అశోక్, శివు, వీరన్న, గోపాల్, దత్తు, ప్రదీప్, నవీన్, రాషాబ్ షకీల్ తదితరులు ఉన్నారు.