దస్తురాబాద్, జూన్ 24 : నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం గొడిసెర్యాల పంచాయతీ కార్యదర్శి శివకృష్ణ రూ.12వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ మధు వివరాల ప్రకారం.. గొడిసెర్యాలకు చెందిన ఓ వ్యక్తి వాటర్ ప్లాంటు, షెడ్డు నిర్మించుకున్నాడు. కరెంటు మీటరుకు దరఖాస్తు చేసుకున్నాడు. మూడు నెలల క్రితం ఎన్వోసీ కావాలని పంచాయతీ కార్యదర్శి శివకృష్ణకు అర్జీ పెట్టుకున్నాడు.
ఎన్వోసీ ఇవ్వడానికి కార్యదర్శి రూ.15 వే లు డిమాండ్ చేయగా.. రూ.12 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. మంగళవారం పంచాయతీ కార్యదర్శి శివకృష్ణకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. శివకృష్ణను ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.