సూర్యపేట : జిల్లాలో పంచాయతీ కార్యదర్శి ఒకరు ఏసీబీ అధికారులకు (ACB Raid) పట్టుబడ్డాడు. జిల్లాలోని తుంగతుర్తి మండలం గానుగబండ గ్రామ పంచాయతీ కార్యదర్శి ( Panchayat secretary ) శుక్రవారం రూ.6 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు.
గ్రామస్థుడు ఒకరు కొత్తగా నిర్మించుకున్న ఇంటికి నంబర్ కేటాయించాలని కార్యదర్శి బర్పాటి కృష్ణా( Krishna) ను సంప్రదించాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వ్యూహం ప్రకారం రూ.6 వేలు తీసుకుంటూ పట్టుబడ్డాడు. అతడి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం నాంపల్లి ఏసీబీ కోర్టు అడిషనల్ స్పెషల్ జడ్జి ఎదుట హజరు పరిచారు.
నాలుగు రోజుల్లో ఏడుగురు
వరుసగా గత నాలుగు రోజుల నుంచి ఏసీబీ అధికారులు మొత్తం 7 గురు ప్రభుత్వ అధికారులను లంచం తీసుకుంటూ పట్టుకున్నారు. నిన్న వనపర్తిలో పౌరసరఫరాల మేనేజర్ జగన్ మోహన్ (Jaganmohan) అవినీతి నిరోధక అధికారులకు చిక్కాడు. గురువారం అతడు రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈనెల 7న వరంగల్ కేయూసీ సబ్ ఇన్స్పెక్టర్ పి. శ్రీకాంత్ ( SI Srikanth )ను అదే రోజు రంగారెడ్డి జిల్లాలో నందిగామ( Nandigama) మండలానికి ఎంపీడీవో, ఎంపీవో పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అంతకు ముందు హైదరాబాద్‌లోని బొగ్గుకుంట ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయంలో ఇన్స్పెక్టర్గా( Endowment inspector ) పనిచేస్తున్న ఆకవరం కిరణ్‌కుమార్ రూ. 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా చిక్కాడు.