కోనరావుపేట, ఆగస్టు 17: లంచం తీ సుకుంటూ ఏసీ బీ అధికారులకు పట్టుబడ్డాడు ఓ పంచాయతీ కార్యదర్శి. ఆదిలాబాద్ జిల్లా ఏసీబీ డీఎస్పీ, కరీంనగర్ ఇన్చార్జి రమణామూర్తి కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన బండారి వోవేల్, బాల య్య తండ్రీకొడుకులు. వీరు మూడు గుంటల భూమిలో రెండు ఇండ్లు కట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి జగదీశ్వర్‌కు దరఖాస్తు చేసుకున్నారు.
ఇందుకోసం ఆయన రూ.30 వేలు లంచం డి మాండ్ చేశారు. ఈనెల 14న రూ.10 వేలు అడ్వాన్స్ తీసుకున్నాడు. మిగి తా రూ.20 వేలు గురువారం గ్రామంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన తాత్కాలిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి జగదీశ్వర్.. వోవేల్ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.