Vakiti Srihari | ఊట్కూర్, జూన్ 20 : దీర్ఘ కాలంగా ఎదుర్కొంటున్న గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని నారాయణపేట జిల్లా తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ (టీపీఎస్ఎఫ్ ) అధ్యక్షుడు అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం వివిధ మండలాల గ్రామపంచాయతీ కార్యదర్శుల తో కలిసి తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరిని కలిసి వినతి పత్రం అందజేశారు. సంవత్సర కాలంగా నిధుల లేమి వల్ల అభివృద్ధి పనులు చేపట్ట లేక పోతున్నామని, నిధుల విడుదల చేపట్టాలని, పంచాయతీ లను నాలుగు గ్రేడ్స్ గా విభజన విభజన చేయాలని, ఓపీఎస్ లను జేపీఎస్ గా కన్వర్షన్ చేయాలని, జేపీఎస్‌ల నాలుగేళ్ల సర్వీస్‌ను కలిపి నాలుగు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, పంచాయతీ కార్యదర్శులకు వెంటనే ప్రమోషన్స్ కల్పించాలని మంత్రిని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల సంఘం మండల అధ్యక్షుడు టిపిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు జగదీష్, వీరన్న, గౌతమ్ గౌడ్, నాగిరెడ్డి, రవికుమార్, అచ్చుతానంద, మధు, అర్జున్, మల్లేష్, సాయినాథ్, లింగప్ప, శివయ్య తదితరులు పాల్గొన్నారు.