చిక్కడపల్లి (హైదరాబాద్), జూలై 8 : గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మామిడాల నరసింహులు డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కారోబార్, బిల్ కలెక్టర్లను జీవో 51 నుంచి మినహాయించాలని కోరారు. వారందరికి ప్రత్యేక స్టేటస్ ఇవ్వాలన్నారు.
ఉద్యో గ భద్రత కల్పించాలని, అన్ని కేటగిరీల సిబ్బందిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. గ్రీన్ చానల్ ద్వా రా ఉద్యోగులందరికీ వేతనాలు అం దించాలని కోరారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 15 లోపు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాయుడు, కోశాధికారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.