హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం కోసం 549 గ్రామాల్లో స్థలాలు గుర్తించామని, మరో 84 గ్రామాల్లో గుర్తించాల్సి ఉన్నదని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క తెలిపారు. అంగన్వాడీ భవనాల కోసం 813 స్థలాలు గుర్తించగా, మరో 98 గుర్తించాల్సి ఉన్నదని చెప్పారు.
త్వరలోనే భవనాల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేస్తామని ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉపాధి హామీ నిధుల ద్వారా ఒకో పంచాయతీ భవన నిర్మాణానికి రూ.20 లక్షలు ఖర్చు చేయనున్నట్టు వివరించారు.