HomeTelanganaPalla Rajeshwar Reddy Says Public Fed Up With 2 5 Years Of Congress Rule
కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత.. కేసీఆర్ పాలనే మళ్లీ రావాలని కోరుకుంటున్నరు
కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో ప్రజలంతా విసుగెత్తిపోయారని కేసీఆర్ సభ జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనే బాగుందని.. మళ్లీ ఆయనే రావాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను గాలికి వదిలేసిందని మండిపడ్డారు.
కేసీఆర్ సభ జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం
హాజరైన ఎమ్మెల్సీ ఎల్ రమణ, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత
సారంగాపూర్, ఏప్రిల్ 17 : కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో ప్రజలంతా విసుగెత్తిపోయారని కేసీఆర్ సభ జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనే బాగుందని.. మళ్లీ ఆయనే రావాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్, బీర్పూర్ మండల కేంద్రాల్లో శుక్రవారం ఎమ్మెల్సీ ఎల్ రమణ, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో సమావేశమై కేసీఆర్ సభ విజయవంతంపై దిశానిర్దేశం చేశారు.
గ్రామాలవారీగా జనసమీకరణ, వాహనాల ఏర్పాటు తదితర అంశాలపై నాయకులతో చర్చించి బాధ్యతలు అప్పగించారు. ఈ నెల 20 నిర్వహించే కేసీఆర్ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆయా సమావేశాల్లో సారంగాపూర్, బీర్పూర్ మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు తేలు రాజు, నేరెళ్ల సుమన్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి అనంతుల గంగారెడ్డి, మాజీ ఎంపీపీ మసర్తి రమేశ్, మాజీ జడ్పీటీసీలు కొల్ముల రమణ, ముక్క శంకర్, పీఏసీఎస్ మాజీ చైర్మన్లు సాగి సత్యంరావు, మెరుగు రాజేశం, మాజీ వైస్ ఎంపీపీలు కొండ్ర రాంచందర్‌రెడ్డి, చెరుపూరి సుభాష్, బేతి పూర్ణచందర్‌రెడ్డి, బల్మూరి లక్ష్మణ్‌రావు, గుడిసె జితేందర్యాదవ్ పాల్గొన్నారు.