హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ‘మొన్న హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో అట్టహాసంగా వరంగల్‌కు వెళ్లిన మంత్రులు.. నీళ్లిచ్చామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు తప్ప, దేవాదుల ప్రాజెక్ట్ మోటర్లు కూడా ఆన్చేయలేకపోయారు..’ అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అలాంటి నాయకులు దయ్యాలు వేదాలు వల్లించిన చందంగా తామే ఆ ప్రాజెక్టును నిర్మించామని చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.
బుధవారం అ సెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. 2001లో చంద్రబాబు శంకుస్థాపన చేస్తే ప్రాజెక్టును పూర్తిచేసిన ఘనత ముమ్మాటికీ కేసీఆర్‌కే దక్కుతుందని స్పష్టంచేశారు. కానీ, కాంగ్రెస్ సర్కారు ఓఅండ్ఎం ఖర్చులకు రూ. 6కోట్లు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. సర్కారు అలక్ష్యంతోనే నీళ్లు ఇవ్వడం ఆలస్యమైందని, అందుకే పలు నియోజకవర్గాల్లోని పంటలు ఎండాయని మండిపడ్డారు.