KTR | జనగామ, నమస్తే తెలంగాణ : వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరుగనున్న భారత రాష్ట్ర సమితి సిల్వర్ జూబ్లీ వేడుకలకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు.
జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద పల్లా రాజేశ్వర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా గజమాలతో సత్కరించి.. స్వాగతం పలికారు. ఆ తర్వాత కేటీఆర్‌తో కలిసి క్యాంపు కార్యాలయంలో భోజనం చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎల్కతుర్తిలోని సభా ప్రాంగణానికి బయలుదేరి వెళ్లనున్నారు.