Palla Rajeshwar Reddy | వరి కొనుగోలు కేంద్రాలను త్వరగా మొదలుపెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కోరారు. దొడ్డు వడ్లకు ఇవ్వకుండా కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తున్నారని ఆయన తెలిపారు. సన్న వడ్లకు కూడా బోనస్ ఇవ్వకుండా బకాయి పెట్టారని అన్నారు. సన్న వడ్ల బకాయిలు రూ.1200కోట్లు ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
వచ్చే సీజన్లో వరి వేయాలా వద్దా అనేది స్పష్టం చేయాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పల్లా రాజేశ్వర్ రెడ్డి కోరారు. యాసంగిలో పండించిన వడ్లను కొంటారా? కొనరా చెప్పండని డిమాండ్ చేశారు.