హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లా కేంద్రం పక్కన ప్రవహిస్తున్న హరిద్రానదిలో పాత రాతియుగ పనిముట్లను కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యులు మచ్చ ప్రణయకుమార్, బుర్ర సంతోష్ గుర్తించినట్టు సంస్థ కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ వెల్లడించారు.
ప్రణయకుమా ర్, సంతోష్ చరిత్ర పూర్వయుగం రాతి చిత్రాల తావులు, ఆలయ శిల్పాలు, రాతి పనిముట్లను గుర్తించి తెలంగాణ చరిత్రను కొత్త పుటలు చేరుస్తున్నారని కొనియాడారు.