హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కరివెన రిజర్వాయర్ వరకు నీటిని తరలించేందుకు చేపట్టిన పనులను డిసెంబర్‌నాటికి పూర్తిచేయాలని, పంప్‌హౌస్‌లకు వెంటనే విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. ఇటీవల పర్యటనలో తీసుకు న్న నిర్ణయాలను యుద్ధప్రాతిపదికన అ మలు చేయాలని సూచించారు.
సచివాలయంలో సోమవారం ఇరిగేషన్ శాఖ కార్యదర్శి శ్రీధర్, ఈ ఎన్సీలు, సీఈలతో నిర్వహించిన ప్రత్యేక సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. పనితీరు సరిగా లేని కాంట్రాక్టర్లపై తగిన చర్యలు చేపడుతామ ని హెచ్చరించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో ఎకువ భాగాన్ని 2027 నాటికి పూర్తిచేయడమే తమ లక్ష్యమని మంత్రి పేరొన్నారు. ఇరిగేషన్ శాఖ ఇంటర్ స్టేట్ విభాగం అధికారుల సమావేశం వివరాలను బయటకు వెల్లడించలేదు.
హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ఎబోలాపై ప్రజలు ఆం దోళన చెందాల్సిన అవసరం లేదని, ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారిపై నిఘా ఉంచినట్టు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సోమవా రం సచివాలయంలో ఎబోలాపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఇద్దరు అనుమానితులను గాంధీ దవాఖానలోని ప్రత్యేక ఐసోలేషన్‌లో ఉంచినట్టు పేర్కొన్నారు.
వారి శాంపిల్స్‌ను పుణెలోని నేషనల్ ఇన్స్టిట్ట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా, నెగటివ్ రిపోర్టు వచ్చిందని పేర్కొన్నారు. శాంపిల్స్‌ను మరోసారి ఎన్ఐవీకి పంపామని, రెండోసారి నెగటివ్ వస్తే డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. ప్రజలు అసత్య ప్రచారాలు నమ్మొద్దని సూచించారు. సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మాణ పనులపై సమీక్షించారు.